vijay devarakonda: 'బాహుబలి' డిస్ట్రిబ్యూటర్ల చేతిలో పడిన 'అర్జున్ రెడ్డి'

'పెళ్లి చూపులు' సినిమాతో విజయ్ దేవరకొండ భారీ విజయంతో పాటు .. యూత్ నుంచి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే 'ద్వారక' సినిమాతో ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో తదుపరి చిత్రమైన 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అసంతృప్తి అనిపించిన సీన్స్ ను రీ షూట్ పెట్టించాడనే టాక్ వుంది.

అలాంటి ఈ సినిమా 'బాహుబలి' డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో పడినట్టు తెలుస్తోంది. 'బాహుబలి'ని డిస్ట్రిబ్యూట్ చేసిన ఏసియన్ ఫిల్మ్స్ వారు .. కె ఎఫ్ సి ఎంటర్టైన్మెంట్స్ వారు, ఈ సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గాను 5.5 కోట్లకి డీల్ కుదిరినట్టు సమాచారం. దర్శకుడిగా సందీప్ రెడ్డి పరిచయమవుతోన్న ఈ సినిమాలో, అలనాటి కథానాయిక కాంచన కీలకమైన పాత్రను పోషించడం విశేషం.    

More Telugu News