: నాలుగు దేశాల సంయుక్త ఉగ్రజాబితా... 9 కంపెనీల పేర్లు వెల్లడి

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ, 9 మంది వ్యక్తులు, 9 సంస్థల పేర్లతో ఉగ్రవాద జాబితాను నాలుగు అరబ్ దేశాలు విడుదల చేశాయి. యూఏఈ, బెహ్రెయిన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాలు కలసి ఈ జాబితాను విడుదల చేస్తూ, ఈ కంపెనీలు, వ్యక్తలపై నిషేధం విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశాయి. యెమెన్ కు చెందిన మూడు కంపెనీలు, లిబియాకు చెందిన 6 కంపెనీల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరు ఉగ్రవాదులకు నిధులందిస్తున్నారని, ఉగ్రదేశంగా గుర్తించిన ఖతార్ తో సంబంధాలు నడుపుతున్నాయని నాలుగు అరబ్ దేశాలు వ్యాఖ్యానించాయి. ఖతార్ కు చెందిన ముగ్గురు, మెమెన్ కు చెందిన ముగ్గురు, లిబియా వాసులు ఇద్దరు, కువైట్ కు చెందిన ఒకరిపైనా నిషేధం విధించాయి.

More Telugu News