: కశ్మీర్‌లో అల్లర్లను పాక్ ఇలా ఎగదోస్తోంది.. బయపెట్టిన ఎన్ఐఏ!

కశ్మీర్‌లో అల్లర్లను ఎగదోసేందుకు పాకిస్థాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్‌ను ఎంచుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు నిధులు అందుతుండడాన్ని ఎన్ఐఏ‌ గుర్తించింది. మొత్తం 28 వాట్సాప్ గ్రూపులు ఈ విషయంలో చురుగ్గా ఉన్నట్టు తేలింది. వీటిలో ఎక్కువ శాతం పాకిస్థానీలు ఏర్పాటు చేసిన గ్రూపులు కాగా, మిగతావి ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవాకు చెందిన వారివిగా గుర్తించారు. ఈ మొత్తం గ్రూపుల్లో 5వేల మంది వరకు ఉన్నారు.

వీరిలో ఎక్కువమంది స్థానిక కశ్మీరులు కాగా వారి ఫోన్ నంబర్లు పాకిస్థానీ మొబైల్ నంబర్లకు అనుసంధానమై ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో పాకిస్థాన్‌కు చెందిన నంబర్లను గుర్తించినట్టు ఎన్ఐఏ అధికారులు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులుకు పాకిస్థాన్ నుంచే నిధులు అందుతున్నాయని, అరెస్టయిన ఏడుగురు హురియత్ నేతలను పూర్తిగా విచారించిన తర్వాత
ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుందని అధికారులు వివరించారు. కాగా, రాళ్ల మూకలో 12 మందిని గుర్తించిన ఎన్ఐఏ వారి స్థావరాలను కనిపెట్టింది. త్వరలోనే వారిని అరెస్ట్ చేసేందుకు రంగం  సిద్ధం చేసింది.

More Telugu News