: వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలంటూ.. 27న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె!

మూడో వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నారు. సంస్థ నష్టాలకు ఉద్యోగులు కారణం కాదని,  ప్రభుత్వం తీసుకుంటున్న బీఎస్ఎన్ఎల్ వ్యతిరేక విధానాలే కారణమని ఆ సంస్థ ఎంప్లాయీ యూనియన్ కన్వీనర్ పి.అభిమన్యు పేర్కొన్నారు. మూడో వేతన సంఘం సిఫార్సులను ఈ నెల 19నే కేబినెట్ ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఈనెల 27న దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెకు వెళ్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే సమ్మె మరింత ఉద్ధృతమవుతుందని అభిమన్యు హెచ్చరించారు.

More Telugu News