Tamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

*  మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు డాక్టరేట్ లభించింది. అహ్మదాబాద్ లోని 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమిషన్' అనే స్వచ్చంద సంస్థ కళారంగానికి తమన్నా చేసిన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.  
*  అక్కినేని నాగార్జున నటించిన 'రాజుగారి గది' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాగార్జున నటించిన ఈ తొలి హారర్ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయడానికి డేట్ ఖరారు చేశారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, శీరత్ కపూర్ నాయికలుగా నటించారు.
*  అల్లరి నరేష్ కథానాయకుడుగా రూపొందుతున్న 'మేడ మీద అబ్బాయి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల ద్వితీయార్థంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నిఖిల విమల్ కథానాయికగా నటించింది.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే ఓ తమిళ చిత్రాన్ని ఒప్పుకోవడం వల్ల 'సాహో' చిత్రానికి అనుష్క డేట్స్ ఇవ్వలేకపోతోందట.   

More Telugu News