: నాకు రాజ్యాంగమే పవిత్ర గ్రంథం.. పార్లమెంటే దేవాలయం: ప్రణబ్ ముఖర్జీ

యాభై ఏళ్ల ప్రజాజీవితంలో తనకు రాజ్యాంగమే పవిత్ర గ్రంథమని, పార్లమెంటే దేవాలయమని, ప్రజలకు సేవ చేయడమే తన అభిమతమని నేడు పదవీ విరమణ చేస్తున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి  ప్రసంగించారు. కాబోయే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ప్రణబ్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన విజయం సాధించాలని కోరుకున్నారు.

‘నాపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీలకు ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ఐదేళ్ల క్రితం రాష్ట్రపతిగా ప్రమాణం చేశా. దేశానికి నేను చేసిన దానికన్నా, దేశం నాకు ఎక్కువే ఇచ్చింది. భిన్నత్వంలో కొనసాగుతున్న మన జాతి ప్రపంచానికి ఆదర్శం. విశ్వవిద్యాలయాలు, శాస్త్ర, సాంకేతిక విద్యా సంస్థల ప్రగతిపై చర్చ జరగాలి. సంక్షోభంలో ఉన్న సేద్యాన్ని లాభసాటిగా మార్చాలి. పర్యావరణానికి నష్టం లేకుండా కొత్త సేద్యాన్ని ఆవిష్కరించాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి’ అని ప్రణబ్ అన్నారు. 

More Telugu News