: సిట్, మీడియా వాళ్లు కలసి సినిమాలు తీసే మాకే 'సినిమా' చూపిస్తున్నారు!: ఆర్.నారాయణమూర్తి

సిట్, మీడియా వాళ్లు కలసి సినిమాలు తీసే తమకే సినిమాలు చూపిస్తున్నారంటూ ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి విమర్శించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ సరఫరాను అరికట్టలేని ప్రభుత్వాలు, వాటిని వినియోగిస్తున్నారంటూ కేసులు పెట్టడం, విచారణలు చేపట్టడం సబబు కాదని అన్నారు. మానవజీవితాలతో, ముఖ్యంగా యువత జీవితాలతో ఆడుకుంటున్న వారిని శిక్షించాలని, చట్టం ముందు అందరూ సమానమేనంటూ చెప్పడం కాదు, తప్పు చేసిన వారిని కూడా సమానంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్నే టార్గెట్ చేయడం సబబు కాదని అన్నారు. సినిమా వాళ్లకూ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటాయని, తాము ఎవరి కంటే కూడా తక్కువా కాదు.. ఎక్కువా కాదని, అందరితో సమానంగా తమనూ చూడాలని నారాయణమూర్తి కోరారు.

More Telugu News