: సుచీ లీక్స్ గురించి ప్ర‌శ్న‌... ధ‌నుష్ వాకౌట్‌.. వీడియో చూడండి

ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో జ‌ర్న‌లిస్టు సుచీ లీక్స్ గురించి ప్ర‌శ్నించ‌గా స‌మాధానం చెప్ప‌కుండా కోపంగా అక్క‌డి నుంచి త‌మిళ న‌టుడు ధ‌నుష్ బ‌య‌ట‌కొచ్చాడు. `విఐపి 2` సినిమా ప్ర‌చారంలో భాగంగా న్యూస్ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూకు హాజ‌రైన ధ‌నుష్, సినిమాకు సంబంధించిన విష‌యాల‌కు బాగానే స‌మాధాన‌మిచ్చాడు. సుచీ లీక్స్‌లో త‌మ గురించిన ఫొటోలు, వీడియోల వ‌ల్ల త‌న వైవాహిక జీవితం ఎలా ప్ర‌భావిత‌మైంద‌ని ప్ర‌శ్నించ‌గా `దిస్ ఈజ్ రియ‌ల్లీ స్టుపిడ్‌` అంటూ ధ‌నుష్ ఇంట‌ర్వ్యూను వాకౌట్ చేశాడు. సింగ‌ర్ సుచిత్ర త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ధ‌నుష్‌, అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ల‌కు సంబంధించిన కొన్ని ర‌హ‌స్యాల‌ను ఫొటోల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే!

More Telugu News