: స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌కు జేమ్స్ కామెరూన్ స‌హాయం?

హాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పేరు మోసిన ఇద్ద‌రు అగ్ర ద‌ర్శ‌కులు క‌లిసి ఒకే సినిమా కోసం ప‌నిచేశారు. `అవ‌తార్‌` లాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలు తీసిన ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్‌, `జురాసిక్ పార్క్‌` ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌కు త‌న కొత్త సినిమా విష‌యంలో స‌హాయం చేశార‌ని హాలీవుడ్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ నూత‌న చిత్రం `రెడీ ప్లేయ‌ర్ వ‌న్‌` సినిమాలో మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ ఎలా ఉప‌యోగించాల‌నే విష‌యంలో జేమ్స్ కామెరూన్ స‌హాయం చేశార‌ని ఆ సినిమాకు స్క్రీన్ రైట‌ర్‌గా ప‌నిచేసిన జాక్ పెన్ వెల్ల‌డించారు. శాండియాగో కామిక్ కాన్ ప్యానెల్ ఇంట‌ర్వ్యూలో చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత ఆయ‌న ఈ విష‌యం చెప్పారు. పూర్తిగా వీడియోగేమ్ నేప‌థ్యంలో సాగే `రెడీ ప్లేయ‌ర్ వ‌న్` సినిమాలో దాదాపు 80 శాతం చిత్రాన్ని మోష‌న్ క్యాప్చ‌ర్ ద్వారానే చిత్రీకరించారు.

More Telugu News