: నువ్వు ఓట్లు వేయించకుండా ఊరికనే మాట్లాడితే...!: నంద్యాల లోకల్ లీడర్ కు చంద్రబాబు హెచ్చరిక

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న వేళ, సీఎం చంద్రబాబునాయుడు, ఓ స్థానిక మైనారిటీ నేతను హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అక్కడి నేతలతో మాట్లాడుతూ "మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రేయర్ చేస్తారా? అందరినీ కన్విన్స్ చేస్తారా? నాకు తెలియదు. నూటికి నూరు శాతం మీరు అందరూ అనుకుంటే, ఒక్క ఓటు కూడా వేరేవాళ్లకు పోదు. మీరు అది చేయండి... మిమ్మల్ని ఏం చేయాలో ఎట్లా గౌరవించాలో నాకు వదిలిపెట్టండి. నువ్వు రేపు ఓట్లు వేపించకుండా ఊరికనే మాట్లాడితే... మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ పని మీరు చేయండి, మీ పని నేను చేస్తా. మీవి (ముస్లింలవి) 56 వేల ఓట్లు ఉన్నాయి. 56 వేలలో ఒక్క ఓటు పోకుండా మీరు ప్రచారం చేసి ప్రభుత్వం పని చేసిందని చెప్పాలి. అల్లా అశీర్వదించాలి" అని అన్నారు. టీడీపీకి ఓట్లు వేయించాలని కోరుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News