: నన్ను ఇంటికి పంపించేయండి: కంటతడి పెడుతున్న మహిళా ఐసిస్ ఉగ్రవాది

2016లో జర్మనీకి చెందిన నలుగురు యువతులు ఐసిస్ లో చేరారు. వారిలో ఓ 16 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. ప్రస్తుతం ఆమె ఇరాక్ సైనిక బలగాల అధీనంలో ఉంది. ఈ సందర్భంగా సైనికాధికారులతో ఆమె మాట్లాడుతూ, ఐసిస్ లో చేరి తాను తప్పు చేశానని, చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నానని చెప్పింది. చేసిన తప్పుకు తాను క్షమాపణలు చెబుతున్నానని అంది.

ఈ యుద్ధ రంగం నుంచి, ఈ కాల్పులు, పేలుళ్ల శబ్దాల నుంచి తనను దూరంగా తీసుకుపోవాలని కంటతడి పెడుతోంది. తాను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని... తనను ఇంటికి పంపించేయాలని రోదిస్తోంది. ఆ యువతి పేరు లిండా. ప్రస్తుతం ఆమెకు జర్మనీ విదేశాంగ కార్యాలయం సహాయక చర్యలు ప్రారంభించింది. ఈ కేసును టేకప్ చేసిన లాయర్ లోరెంజ్ హాసే మాట్లాడుతూ, ఆమె ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తనకు ఇంకా పూర్తి క్లారిటీ లేదని చెప్పారు. అయితే ఆమెకు కొంచెం సహాయం మాత్రం అందుతోందని తెలిపారు.

More Telugu News