: 2.6 మిలియన్ ఏళ్లనాటి వెలకట్టలేని శిలాజానికి ధర నిర్ణయం.. జస్ట్ రూ.4500కే సొంతం చేసుకోవచ్చు!

మిలియన్ ఏళ్లనాటి అత్యంత అరుదైన, వెలకట్టలేని శిలాజం ఇప్పుడు కేవలం రూ.4500కే అమ్మకానికి సిద్ధంగా ఉంది. పంజాబ్‌లోని చిన్న పల్లెటూరు అయిన మాసోల్‌లో ఇప్పుడు దీనిని విక్రయానికి ఉంచారు. 2.6 మిలియన్ ఏళ్లనాటిదిగా చెబుతున్న ‘హెమిబోస్’ పుర్రె (ప్రస్తుతం అడవి దున్న)ను గ్రామంలో కేవలం రూ.150కే విక్రయిస్తుండగా దీనిని స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది ఓ ఫ్రెంచ్ జర్నల్‌ కాంప్టెస్ రెండుస్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. మాసోల్‌లో లభ్యమైన పుర్రెపై ఉన్న కట్ మార్కులు అప్పటి ఆదిమానవుల సంచారానికి గుర్తు అని పేర్కొంది. ఈ పుర్రెను వెలకట్టలేమని పంజాబ్ యూనివర్సిటీలోని జియాలజీ విభాగ నిపుణుడు రాజీవ్ పట్నాయక్ పేర్కొన్నారు. ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 మాత్రమే ఉన్నట్టు ఆయన వివరించారు. ఈ శిలాజాన్ని అందరూ వీక్షించేలా మ్యూజియంలో పెట్టాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. తద్వారా మరిన్ని పరిశోధనలకు ఆస్కారం లభిస్తుందని చెబుతున్నారు.

More Telugu News