: కర్ణాటకను దాటి తెలుగు రాష్ట్రాల్లోకి పరుగులు పెడుతున్న కృష్ణమ్మ!

ఎగువ కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలో జల ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు వస్తున్న వరద నీరు ఈ సీజన్ లో తొలిసారిగా ఉదయం లక్ష క్యూసెక్కులను దాటింది. నేడు ప్రాజెక్టులోకి వస్తున్న నీరు 1,08,874 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 70 టీఎంసీలకు చేరింది. 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కు 42,340 క్యూసెక్కల నీరు వస్తుండగా, నీటి నిల్వ 23 టీఎంసీలను దాటింది.

మరోవైపు తుంగభద్ర జలాశయానికి సైతం 44,649 క్యూసెక్కుల నీరు వస్తోంది. వరద ప్రవాహం మరో నాలుగు రోజులు ఇదే స్థాయిలో కొనసాగితే, ఆల్మట్టితో పాటు నారాయణమూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలు నిండుతాయని అధికారులు చెబుతున్నారు. ఆపై వచ్చే నీరంతా శ్రీశైలంకు వస్తుంది. శ్రీశైలంలో నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

More Telugu News