: ఇక మూడో లింగం ఉండదు.. వారు ఆడో, మగో, ట్రాన్స్‌జెండరో చెప్పాల్సిందే.. సిద్ధమవుతున్న ట్రాన్స్‌‌జెండర్ బిల్లు!

ట్రాన్స్‌జెండర్ల కోసం ఇకపై ఎక్కడా ‘మూడో లింగం’ ఆప్షన్ కనిపించదు. వారు ఆడ, మగ, లేదంటే ట్రాన్స్‌జెండర్.. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే. గతంలో ట్రాన్స్‌జెండర్ల కోసం ‘మూడో లింగం’ అనే ఆప్షన్ ఉండేది. అయితే తాజాగా రమేష్ బెయిస్ నేతృత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత కోసం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సరికొత్త ప్రతిపాదనలు చేసింది. ఇక నుంచి ఎవరైనా తాము.. స్త్రీ, పురుష, ట్రాన్స్‌జెండర్ కేటగిరీల్లో దేనికి చెందుతామో తప్పకుండా చెప్పాల్సిందేనని ప్రతిపాదించింది.

ట్రాన్స్‌జెండర్  పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) బిల్లు-2016‌లో ఈ మేరకు పేర్కొంది. హింస, వివక్ష నుంచి ట్రాన్స్‌జెండర్లకు రక్షణ కల్పించేందుకే ఈ ప్రతిపాదన తెచ్చినట్టు రమేష్ పేర్కొన్నారు. గే, లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్ సెక్స్.. ఇలా చెప్పుకోవడం సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. అలాగే వారికి అందుతున్న విద్య విషయంలోనూ కమిటీ సరికొత్త ప్రతిపాదనలు చేసింది. ఇతర విద్యార్థులతో కలిసి ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు కలిసి ఎటువంటి జంకు, భయం లేకుండా సరికొత్త విద్యావిధానం అమలు చేయాలని ప్రతిపాదించింది.

More Telugu News