: ఫేస్‌బుక్ నుంచి ‘మాడ్యులర్’ స్మార్ట్‌ఫోన్.. ప్రత్యేకతలు బోలెడు!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ తయారీకి శ్రీకారం చుట్టింది. ‘మాడ్యులర్ ఎలక్ట్రోమెకానికల్ డివైస్ (రీడ్ స్మార్ట్‌ఫోన్)ను అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. వినియోగదారులకు ఈ స్మార్ట్‌ఫోన్‌ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో ఓ స్పీకర్, మైక్రోఫోన్, టచ్ డిస్‌ప్లే, జీపీఎస్ ఉంటాయి. అచ్చం ఫోన్‌లా పనిచేస్తుందని ‘బిజినెస్ ఇన్‌సైడర్’ పేర్కొంది.

ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధిలో ఫేస్‌బుక్‌కు చెందిన హార్డ్‌వేర్ ల్యాబ్ ‘బిల్డింగ్ 8’ బిజీగా ఉంది. కటింగ్-ఎడ్జ్ కెమెరా, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ అభివృద్ధిలో బిజీగా ఉండే ఈ ల్యాబ్ ఇప్పుడు ప్రస్తుత ప్రాజెక్టుపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 3డీ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల దీనిని స్మార్ట్‌ఫోన్‌లా, మ్యూజిక్ స్పీకర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.

More Telugu News