: ఆ విష‌యం రాజ‌మౌళిని అడ‌గండి!: రామ్ గోపాల్ వ‌ర్మ‌

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన డ్ర‌గ్స్ కేసులో వివాదాస్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ... త‌న ఫేస్ బుక్ పేజ్ లో  పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ డైరెక్ట‌ర్‌ అకున్ సబర్వాల్‌ని హీరోని చేసేస్తున్నారని, రాజమౌళి ఆయనతో బాహుబలి-3 తీస్తారేమో? అని వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆయ‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల ప‌ట్ల ఈ రోజు ఆయ‌న ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

బాహుబ‌లి-3 సినిమాను రాజ‌మౌళి తీస్తాడేమో అని తాను అన్నాన‌ని, ఈ ప్ర‌శ్న‌ను రాజ‌మౌళినే అడ‌గాల‌ని వ్యాఖ్యానించారు. కాగా, ఈ రోజు తాను త‌న ఫేస్‌బుక్‌లో అకున్ స‌బ‌ర్వాల్ ను విమ‌ర్శించ‌లేద‌ని, విచార‌ణ జ‌రుగుతున్న తీరుపై కొన్ని అనుమానాల‌ను మాత్ర‌మే ఉంచాన‌ని అన్నారు.     

More Telugu News