: యుద్ధానికి సరిపడేలా.. భారీగా మందుగుండు సామగ్రి సిద్ధం చేసుకుంటున్న భారత్

ఓ వైపు పాకిస్థాన్ క‌వ్వింపు చర్యలు, మ‌రోవైపు యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నామ‌న్న‌ట్లు చైనా చ‌ర్య‌ల‌తో భార‌త్ కు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని వ‌స్తోన్న అభిప్రాయాల నేప‌థ్యంలో యుద్ధం వస్తే, భార‌త్ వ‌ద్ద కావాల్సినంత మందుగుండు సామ‌గ్రి లేద‌ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ (కాగ్‌) స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో భార‌త్ సత్వ‌ర చ‌ర్య‌లు తీసుకుంటోంది. వీలైనన్ని మార్గాల్లో, సాధ్యమైనంత త్వ‌ర‌గా మందుగుండు నిల్వను పెంచాలని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

వ‌చ్చేనెల‌ ఒకటో తేదీలోగానే మ‌న దేశ యుద్ధ ట్యాంకులకు, తుపాకులకు అవసరమైన మందుగుండును భారీగా దిగుమ‌తి చేసుకుంటోంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం యుద్ధ సామగ్రిలో అవ‌స‌ర‌మైన 40 శాతం మాత్రమే మందుగుండు ఉంది. మ‌రో అర‌వై శాతం మందుగుండును కూడా భార‌త్ సిద్ధం చేసుకుంటోంది. 2016లో జ‌రిగి ఉరీ ఉగ్రదాడి త‌రువాత భార‌త‌ రక్షణశాఖ మందుగుండు కొనుగోలుకి రూ.12,000 కోట్ల నిధుల‌తో వాటికోసం ఆర్డర్లు చేసింది.

More Telugu News