nani: భారీ చిత్రాల సరసన టాప్ 4 గా నిలిచిన 'నిన్నుకోరి'

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా రూపొందిన 'నిన్ను కోరి' .. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నివేదా థామస్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. యుఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర తొలివారంలోనే 1 మిలియన్ వసూళ్లను రాబట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

 ఈ ఏడాది యుఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర హయ్యెస్ట్ గ్రాస్ ను వసూలు చేసిన టాప్ 5 తెలుగు చిత్రాలలో, 128 కోట్లు వసూలు చేసి 'బాహుబలి 2' మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 16.33 కోట్ల రూపాయలను రాబట్టి రెండవ స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' కొనసాగుతోంది. మూడవ స్థానాన్ని 11.1 కోట్లతో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ 7.47 కోట్లతో 'నిన్ను కోరి' 4వ స్థానాన్ని దక్కించుకుని, భారీ చిత్రాల సరసన నిలవడం విశేషం. ఇక 7.39 కోట్లతో ఐదవ స్థానంలో ' కాటమరాయుడు' కొనసాగుతోంది.    

More Telugu News