: నెలలో 15 రోజులు గోవాలో ఎందుకు ఉంటావ్?: హీరో తరుణ్ పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం

డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. యువ నటుడు తరుణ్ ను సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా తరుణ్ పై వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తరుణ్ ను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఇవి...

  • కెల్విన్ డ్రగ్స్ సప్లయర్స్ కాల్ లిస్ట్ లో నీ పేరు ఎందుకుంది? 
  • పబ్ ను ఎంత కాలం నడిపావు? 
  • ఏఏ ఈవెంట్లను నిర్వహించావు? 
  • ఏ ఈవెంట్ ఆర్గనైజర్లు డ్రగ్స్ సప్లై చేశారు? 
  • నెలలో 15 రోజులు గోవాలో ఎందుకు ఉంటావు? 
  • గోవాలో నీకు డ్రగ్స్ ఎవరిస్తారు? 
  • గోవా బీచ్ హౌస్ లో డగ్స్ వాడుతున్నావా? 
  • సినిమాలు చేయడం మానేసి, డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించావా? 
  • హైదరాబాదులోని ఇతర పబ్ ఓనర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? 
  • పబ్ లలో డ్రగ్స్ దొరుకుతున్నాయన్న ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి? 
ఇలాంటి ప్రశ్నలతో తరుణ్ ను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. 

More Telugu News