: రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయడం ఖాయం: ఎక్సైజ్ రిటైర్డ్ అధికారి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తోన్న విపరీత వ్యాఖ్యల ఎక్సైజ్ అధికారుల సంఘం ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై వ‌ర్మ ఫేస్‌బుక్ వేదిక‌గా ప‌లు వ్యాఖ్య‌లు చేస్తూ మీడియాలో వ‌స్తోన్న క‌థనాల‌ను ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్‌ను ఎందుకు ఆప‌డం లేదంటూ ప‌లు వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. వ‌ర్మ తీరుపై ఎక్సైజ్ శాఖ‌ రిటైర్డ్ అధికారి ఒక‌రు మాట్లాడుతూ... రామ్ గోపాల్ వ‌ర్మ వ్యాఖ్య‌లను తాము స‌హించ‌బోమ‌ని తేల్చిచెప్పారు. కొన్ని సెక్ష‌న్ల కింద రామ్ గోపాల్ వ‌ర్మ‌పై కేసు వేస్తామ‌ని అన్నారు.

కేసును విచార‌ణ చేస్తోన్న‌ ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్‌పై వ‌ర్మ వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇటువంటి కేసుల్లో గ‌తంలోనూ ఎన్నింటినో ఎక్సైజ్ శాఖ విచారించింద‌ని అన్నారు. అప్ప‌ట్లో న్యూస్ ఛానెళ్లు, వెబ్‌సైట్లు ఇంత‌గా లేవు కాబ‌ట్టి కేవ‌లం పేప‌ర్లో మాత్ర‌మే సినీ ప్ర‌ముఖుల డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై క‌థ‌నాలు వ‌చ్చేవ‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఇప్పుడు న్యూస్ ఛానెళ్లు ఎన్నో ఉన్నాయి కాబ‌ట్టి సినీ ప్ర‌ముఖుల వ్య‌వ‌హారం త్వ‌ర‌గా అందరికీ తెలిసిపోతోంద‌ని చెప్పారు. డ్ర‌గ్స్ కేసును ఆటంక‌ప‌రిచేలా వ‌ర్మ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. అకున్‌ స‌బ‌ర్వాల్‌ని సినిమాల్లోని పాత్ర‌ల‌తో పోల్చుతూ వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు చాలా అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. ఓ డీఐజీ స్థాయి అధికారాని వ‌ర్మ కించ‌ప‌రుస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వ‌ర్మ అరెస్టు కావ‌డం ఖాయం అని స్ప‌ష్టంచేశారు.

More Telugu News