prabhas: ప్రభాస్ జోడీగా కొత్త హీరోయిన్ ను ఫైనల్ చేశారట!

ప్రభాస్ తదుపరి చిత్రంగా 'సాహో' మొదలైంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది గానీ .. పూర్తి స్థాయిలో ఇంకా ఊపందుకోలేదు. హీరోయిన్ ఎంపిక విషయం పూర్తి కాకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. ఈ సినిమా కోసం కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించారు. కానీ వాళ్లు ఒక రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేయడంతో ఆలోచనలో పడినట్టుగా వార్తలు వచ్చాయి.

కొత్త అమ్మాయిని ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతుందనేది తాజా సమాచారం. అయితే ఆ అమ్మాయిని ఫస్టు హీరోయిన్ గా తీసుకున్నారా? .. రెండవ కథానాయికగా ఎంపిక చేసుకున్నారా? అనే విషయం తెలియాల్సి వుంది. ఏదేవైనా తొలి సినిమాతోనే ప్రభాస్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన ఆ అదృష్టవంతురాలు ఎవరో?   

More Telugu News