ram: విశాఖలో రామ్ సందడి చేసేస్తున్నాడు

'నేను శైలజ' సినిమాతో హిట్ అందుకున్న రామ్ .. ఆ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమలకు మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లి కొంత కాలమవుతోంది. అనుకున్న ప్రకారం షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హీరో రామ్ .. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై విశాఖలో పాటను చిత్రీకరిస్తున్నారు. అంతకుముందు ఇక్కడ కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు.

 ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ తో గిటారిస్ట్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం కొంతకాలం పాటు రామ్ గిటార్ ప్లే చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట. విశాఖలో షూటింగ్ ముగిసిన తరువాత ఈ సినిమా టీమ్ అరకుకి షిఫ్ట్ కానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో రామ్ వున్నాడు. 

More Telugu News