: నటుడు సుబ్బరాజుకు సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు ఇవే

డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10.15 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుబ్బరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కింద పేర్కొన్న ప్రశ్నలను అధికారులు అడిగినట్టు తెలుస్తోంది.

  • మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? 
  • పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటారా? 
  • పూరీ ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా? 
  • పూరీతో కలసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారు? 
  • అక్కడ ఏం చేశారు? 
  • అక్కడ పూరీ విదేశీ నంబర్లు వాడారు... మీకు తెలుసా? 
  • కెల్విన్ తెలుసా? 
  • ఎలా పరిచయం అయ్యాడు? 
  • పూరీ, శ్యామ్ లతో పాటు మీరూ కెల్విన్ ను కలిసేవారా? 
  • పూరీ ఇంట్లో పార్టీలో ఏం జరిగేది? 
  • మీరు డ్రగ్స్ పార్టీలకు వెళ్లేవారా? 
  • కెల్విన్ తో మీరు డైరెక్ట్ గా డీల్ చేసేవారా? 
  • కెల్విన్ కు మీరు ఎవరెవరిని పరిచయం చేశారు? 
  • మీకు ఎంత మంది ఈవెంట్ ఆర్గనైజర్లు తెలుసు?  
  • సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది? 
  • మీ రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలను పరీక్షలకు తీసుకోవచ్చా?

More Telugu News