: ఎయిడ్స్ అంటువ్యాధిలా విస్తరిస్తున్న దేశాల్లో మన దేశమూ వుంది!

పది దేశాల్లో హెచ్ఐవీ అంటువ్యాధిలా ప్రబలుతోందంటూ ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. ఈ జాబితో మన దేశంతో పాటు మన పొరుగు దేశాలు చైనా, పాకిస్థాన్ లు కూడా ఉన్నాయి. వియత్నాం, మయన్మార్, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్, పపువా న్యూ గినియా, థాయ్ లాండ్, మలేసియాల్లో కూడా హెచ్ఐవీ గణనీయంగా విస్తరిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ సోకిన బాధితుల్లో 95 శాతం మంది ఈ 10 దేశాలకు చెందినవారేనని తెలిపింది.

 ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లతో లైంగిక కార్యకలాపాలు, ఇంజెక్షన్లతో డ్రగ్స్ తీసుకోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పింది. భారత్ లోని 26 నగరాల్లో జరిపిన సర్వేలో 46 శాతం మంది డ్రగ్స్ ను ఇంజెక్ట్ చేసుకోవడం వల్లే హెచ్ఐవీ బారిన పడ్డారని పేర్కొంది. గతంతో పోలిస్తే ఎయిడ్స్ మరణాలు తగ్గాయని... ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ బారిన పడుతున్న వారి సంఖ్య గత ఆరేళ్ల నుంచి 13 శాతం తగ్గిందని తెలిపింది.

More Telugu News