prabhudeva: 'దబాంగ్' సీక్వెల్ ప్రభుదేవా చేజారిపోయింది!

బాలీవుడ్ సూపర్ హీరో సల్మాన్ ఖాన్ కెరియర్లో 'దబాంగ్' సినిమాకి ప్రత్యేకమైన స్థానం వుంది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. 'దబాంగ్ 3'ను భారీ స్థాయిలో నిర్మించడానికి సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రంగంలోకి దిగాడు. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకుడిగా వ్యవహరించే ఛాన్స్ ఉందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టు ఆయన చేజారిపోయినట్టు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు విషయంపై 'భాగీ' ఫేమ్ సబీర్ ఖాన్ ను అర్బాజ్ సంప్రదించడం .. ఆయన స్క్రిప్ట్ పై దృష్టి పెట్టడం జరిగిపోయాయట. ఈ విషయాన్ని ఆయనే 'ముంబై మిర్రర్'కి స్వయంగా చెప్పడం విశేషం. ఒక మంచి అవకాశం వచ్చినట్టే వచ్చి .. చేజారిపోవడం ప్రభుదేవాకి కాస్తంత నిరాశనే కలిగించిందని చెప్పుకుంటున్నారు.   

More Telugu News