: నాటి రూ. 1000 పెట్టుబడి విలువ నేడు రూ. 16.50 లక్షలు: ముఖేష్

1977లో రూ. 1000 పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు దాని విలువ రూ. 16.50 లక్షలకు పైగా ఉందని, భారత చరిత్రలో మరే సంస్థా సాధించలేని ఘనతను తామందుకున్నామని తెలిపారు. ప్రతి రెండున్నరేళ్లకూ పెట్టుబడి రెట్టింపవుతూ వచ్చిందని అన్నారు. ఇంతటి ఘన విజయం కంపెనీ సాధించడానికి కారణం తన తండ్రి దీరూభాయ్ అంబానీ, తల్లి కోకిలాబెన్ దీవెనలే కారణమని చెప్పుకొచ్చారు. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న వేళ, షేర్ హోల్డర్లను ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

జియోను ప్రారంభించి కేవలం పది నెలలు మాత్రమే అయిందని, ఈ పది నెలల కాలంలో ప్రపంచంలోని మరే టెలికం సంస్థ కూడా సాధించలేని విజయాన్ని తాము సొంతం చేసుకున్నామని వాటాదారుల హర్షధ్వానాల మధ్య ముఖేష్ ప్రకటించారు. రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో 4జీ సేవలను తాము తీసుకువచ్చి, లక్ష్యాలకు అనుగుణంగా, 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకున్నామని, ఇది సంస్థకు మాత్రమే లభించిన అరుదైన రికార్డని ముఖేష్ వెల్లడించారు. సరాసరిన సెకనుకు ఏడుగురు రిలయన్స్ జియో సభ్యత్వాన్ని తీసుకున్నారని చెప్పారు. ఫేస్ బుక్, వాట్స్ యాప్ లకన్నా వేగంగా తమ సేవల కోసం కస్టమర్లు వచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం జియో సేవలను 12.5 కోట్ల మంది అందుకుంటున్నారని, తనను నమ్మినందుకు వారందరికీ కృతజ్ఞతలని తెలిపారు.

More Telugu News