: నవంబరులోనే ఏపీ బడ్జెట్... అప్పుడే రంగంలోకి దిగిన యనమల!

2018 నుంచి జనవరి - డిసెంబర్ మధ్య కాలాన్నే ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను నవంబరులోనే ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం కావాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అందాయి. నవంబర్ నెలాఖరులో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్న సంకేతాల మేరకు యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తులు మొదలు పెట్టింది. కేంద్ర నిర్ణయం ప్రకారం నవంబరులో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. కాగా, కేంద్ర బడ్జెట్ డిసెంబర్ లో పార్లమెంట్ ముందుకు రానుంది.

More Telugu News