: పాత నోట్లు వున్నాయని చెప్పి, వెంకటేశ్వర స్వామిని జైలుకు పంపుతారా ఏంటి?: సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదన

తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉన్న సుమారు రూ. 8.29 కోట్ల రద్దయిన పాత నోట్ల మొత్తాన్ని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ ఆసక్తికర వాదనలు సాగాయి. రద్దయిన రూ. 1000, రూ. 500 నోట్ల మార్పిడికి ఎన్నారైలు, జిల్లా సహకార బ్యాంకులకు అదనపు సమయం ఇచ్చి, టీటీడీకి ఇవ్వకపోవడం అన్యాయమని పిటిషనర్ రమణమూర్తి పేర్కొన్నారు.

రద్దయిన నోట్లు ఎవరి వద్దనైనా ఉంటే అది నేరమని, పాత నోట్లు ఉన్నందుకు వెంకటేశ్వర స్వామిని జైలుకు పంపుతారా? లేక టీటీడీని పంపుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నోట్లను అనుమతించకపోవడం వల్ల స్వామివారు భక్తులు సమర్పించిన కానుకలను అందుకోకుండా తిరస్కరించినట్టు అవుతుందని తెలిపారు. భక్తితో సమర్పించే కానుకలు స్వామివారికి, అభివృద్ధి పనులకు, భక్తుల సేవలకు వినియోగం కాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. కాగా, తదుపరి వాదనల నిమిత్తం కేసు విచారణ వాయిదా పడింది.

More Telugu News