: పాక్ కిరాతకం.. స్కూలు పిల్లలు, గ్రామస్థులే లక్ష్యంగా కాల్పులు

పాక్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న స్కూళ్లు, గ్రామస్థులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోందని భారత్ ఆరోపించింది. ఈ మేరకు ఇండియన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ పాకిస్థాన్ మేజర్ జనరల్ షాహిర్ షంషాద్ మిర్జాతో గురువారం మధ్యాహ్నం హాట్‌లైన్ ద్వారా మాట్లాడారు. తమ దళాలను నియంత్రించాలని కోరారు. ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా అడ్డుకోవాలని కోరారు. రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో ఉన్న స్కూళ్ల విద్యార్థులను మంగళవారం తరలిస్తుండగా పాక్ దళాలు కాల్పులు జరిపినట్టు భట్ పేర్కొన్నారు. ఇక నుంచి ఇటువంటి కార్యకలాపాలకు తమవైపు నుంచి అడ్డుకట్ట వేయాలని తేల్చి చెప్పారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 240 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

More Telugu News