kajal: లండన్ రోడ్లపై రకుల్, కాజల్ కేరింతలు!

ఇప్పుడు మనకున్న కథానాయికల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుంది. ఎవరికి వచ్చిన అవకాశాలను వాళ్లు సద్వినియోగం చేసుకుంటూ .. పాత్ర పరిధిలో మెప్పిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ సక్సెస్ లను సాధిస్తూ .. ఎంతో స్నేహంగా వుంటున్నారు. అలాంటి కథానాయికలలో కాజల్ .. రకుల్ కూడా కనిపిస్తారు.

 తెలుగుతో పాటుగా తమిళ .. హిందీ భాషా చిత్రాలను కాజల్ చుట్టేయగా .. రకుల్ ఆ దిశగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మంచి స్నేహితులైన ఈ ఇద్దరూ లండన్ రోడ్లపై కలుసుకుని .. ఆనందంతో కేరింతలు కొట్టారు. హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం రకుల్ లండన్ వెళ్లగా .. హాలిడే టూర్ లో భాగంగా కాజల్ అక్కడికి వెళ్లింది. లండన్లో కలుసుకోవడం వాళ్లకి ఎంత సంతోషాన్ని కలిగించిందనేది ఈ ఫోటో చూస్తేనే అర్థమైపోతోంది.    

More Telugu News