gopichand: ఇంతవరకూ ఇంతటి గ్లామర్ రోల్ చేయలేదన్న కేథరిన్!

తెలుగు తెరపై గ్లామర్ తో కట్టిపడేస్తోన్న కథానాయికలలో కేథరిన్ ఒకరు. ఇప్పుడిప్పుడే ఆమెకి ఇక్కడ అవకాశాలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆమె 'గౌతమ్ నంద' సినిమాలో ఒక హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో తాను 'ముగ్ధ' పాత్రలో మరింత గ్లామర్ గా కనిపిస్తానని కేథరిన్ చెప్పింది. ఈ పాత్రను సంపత్ నంది అద్భుతంగా మలిచాడనీ .. ఇంతవరకూ తాను ఈ స్థాయి గ్లామర్ తో తెరపై కనిపించింది లేదని అంది.

మాస్ ఆడియన్స్ కి నచ్చేలా దర్శకుడు సంపత్ నంది తనని చాలా అందంగా చూపించాడని చెప్పింది. ఈ సినిమాలో తాను చేసిన ఈ గ్లామర్ రోల్, తనకి మరిన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో గోపీచంద్ అందించిన సహాయ సహకారాలను మరిచిపోలేనని చెప్పుకొచ్చింది.          

More Telugu News