dhanush: ధనుష్ మూవీ 'విఐపి 2' రిలీజ్ వాయిదా పడిపోయింది!

గతంలో ధనుష్ చేసిన 'విఐపి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా సీక్వెల్ గా ఆయన 'విఐపి 2' సినిమాను నిర్మించాడు. సౌందర్య రజనీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించింది. ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను విడుదల చేయాలనుకున్నారు.

 కానీ ఈ సినిమా ఆ రోజున రావడం లేదనేది తాజా సమాచారం. కారణమేదైనా ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటించనున్నారు. ధనుష్ .. అమలా పాల్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో, కాజోల్ ఒక కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.   

More Telugu News