: దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంతో పుతిన్‌ స్నానం చేస్తారట!

రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించిన ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తన లైంగిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి ఆయన దుప్పి (రాయల్ స్టాగ్) కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారంటూ సంచలన విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. పుతిన్ తన స్నానానికి గాను గత ఏడాది 70 కిలోల దుప్పి కొమ్ములను సేకరించారని పేర్కొంది. కాగా, రష్యా దేశంలో ఔషధపరంగా దుప్పి కొమ్ములకు చాలా ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా ఈ కొమ్ముల నుంచి తీసిన రక్తాన్ని ఉపయోగించడం ద్వారా శారీరక సమస్యల నుంచి బయటపడవచ్చని అక్కడి వారి నమ్మకం. ఈ రక్తంతో కొందరు స్నానం చేస్తారని, మరికొందరు దీనిని సేవిస్తారని సమాచారం. దుప్పి కొమ్ముల రక్తం పది మిల్లీ లీటర్ల ఖరీదు వంద డాలర్లు విలువ చేస్తుందని సమాచారం.

More Telugu News