: ప్రపంచ దేశాలు మనకే మద్దతు ఇస్తున్నాయి!: చైనా విషయంలో సుష్మా స్వరాజ్

డోక్లాంలో రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌ని చూస్తోన్న చైనా ఆగ‌డాల‌కు భార‌త్ చెక్ పెట్ట‌డంతో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ రోజు రాజ్యసభలో ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విష‌యంలో ప్రపంచ దేశాల మ‌ద్ద‌తు భారత్‌కే ఉంద‌ని అన్నారు. ఈ వివాదంపై భారత్‌ ఎలాంటి అసంబద్ధ విషయాలు చెప్పట్లేదని స్ప‌ష్టం చేశారు. చైనా, భూటాన్‌ మధ్య స‌రిహ‌ద్దు వివాదం ఉన్న ఇన్నాళ్లూ భార‌త్ ఆ ప్రాంతం విష‌యంలో ఎటువంటి జోక్యం చేసుకోలేద‌ని అన్నారు.

అయితే, ఇప్పుడు భారత్‌, టిబెట్‌, భూటాన్‌ జంక్షన్‌ వరకు ఆ వివాదం వ‌చ్చింద‌ని, భార‌త్‌ భద్రతపై ప్రభావం చూపే అవ‌కాశం ఉన్న కార‌ణంగానే చైనాను అడ్డుకుంటున్న‌ట్లు సుష్మా స్వరాజ్ తెలిపారు. అక్క‌డి రోడ్డు నిర్మాణంపై భార‌త్‌ ఇప్పటికే పలుసార్లు ఆ దేశాన్ని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. భార‌త్‌పై విష‌ం క‌క్కుతూ చైనా ప‌త్రిక‌లు చేస్తోన్న‌ ఆరోపణలను సుష్మాస్వరాజ్ తోసిపుచ్చారు.      

More Telugu News