: వెనక్కు వెళ్లకుంటే బంధిస్తాం... లేదంటే చంపేస్తాం: భారత సైనికులకు చైనా వార్నింగ్

సిక్కిం, భూటాన్ లకు సమీపంలోని డోక్లాం ప్రాంతంలో చైనా, భారత సైనికుల మోహరింపుతో పరిస్థితులు ఉద్రిక్తమైన వేళ, చైనా మాజీ రాయబారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైనికుల ముందు మూడు ఆప్షన్లు ఇస్తూ, తొలుత బేషరతుగా వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బందీలుగా పట్టుబడాలని, అప్పుడు ప్రాణాలైనా మిగులుతాయని, అలా కూడా చేయకుంటే, చంపేస్తామని హెచ్చరించారు.

సరిహద్దుల్లో సమస్య భారత్ వల్లే వచ్చిందని ఆరోపిస్తూ, దీనికి దౌత్యపరమైన పరిష్కారం సాధ్యం కాదని అభిప్రాయపడ్డ చైనా విదేశీ వ్యవహారాల నిపుణుడు లియు యౌఫా సెంట్రల్‌ టెలివిజన్‌ ఇంగ్లిష్‌ చానెల్‌ తో మాట్లాడుతూ, కఠిన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో చైనా కౌన్సెల్‌ జనరల్  గానూ గతంలో పని చేసిన లియు, సైనిక దుస్తులతో ఒకరు మరో దేశంలోకి వస్తే, వారు శత్రువులేనని అన్నారు. భారత్ ముందు మూడు ఆప్షన్స్ ఉంచామని, వాటిల్లో ఏది ఎంచుకుంటుందోనని తాము వేచి చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అర్థవంతమైన, సున్నితమైన ప్రత్యామ్నాయాన్ని మాత్రమే భారత్ ఎంచుకుంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. స్వచ్ఛందంగా వెనక్కు వెళ్లకపోతే, తమ సైనికుల చేతుల్లో భారత సైనికులు మరణిస్తారని అన్నారు.

More Telugu News