: ఇంట‌ర్నెట్ లోగిలికి కొత్త సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌... అమెజాన్ స్పార్క్‌

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ సంస్థ `అమెజాన్ స్పార్క్‌` పేరుతో ఓ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. షాపింగ్ ప్రాధాన్యంగా రూపొందించిన ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ఇంత‌కుముందే అందుబాటులో ఉన్న పిన్‌ట్రెస్ట్‌, ఇన్‌స్టాగ్రాంల లాగే ఉండ‌టంతో నెటిజ‌న్ల మెచ్చుకోలు పెద్ద‌గా పొంద‌డం లేదు. ప్ర‌స్తుతం ఆపిల్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులోకి తెచ్చిన ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ యాప్‌ను ఉప‌యోగించాలంటే అమెజాన్ ప్రైమ్ స‌భ్య‌త్వం ఉండాలి. త‌మ షాపింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆస‌క్తులు, రివ్యూలు పోస్ట్ చేసుకునే సౌక‌ర్యం ఈ యాప్‌లో ఉంది. అలాగే వినియోగ‌దారులకు, అమ్మేవారికి వార‌ధిగా ఈ యాప్ ప‌నిచేస్తుంద‌ని అమెజాన్ ప్ర‌తినిధి బాబ్ హెతూ తెలిపారు.

More Telugu News