: తొలి రౌండులోనే మీరా కుమార్ ను వెనక్కు నెట్టేసిన రామ్ నాథ్ కోవింద్

ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితం పార్లమెంటు హౌస్ లో ప్రారంభం కాగా, తొలి రౌండులోనే మీరా కుమార్ ను వెనక్కు నెట్టేసిన రామ్ నాథ్ కోవింద్ ఆధిక్యంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తరఫున రామ్ నాథ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ తరఫున మీరా కుమార్ లు రాష్ట్రపతి పదవికి పోటీ పడ్డ సంగతి తెలిసిందే. మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటు హక్కు ఉండగా, 99 శాతం ఓటింగ్ నమోదైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన 32 పోలింగ్ స్టేషన్ల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సుల్లో ఒక్కొక్కటీ ఓపెన్ చేసి ఓట్లను లెక్కించనున్నారు. నేటి సాయంత్రం 5 గంటలలోగా పూర్తి ఫలితాలు వెలువడవచ్చు.

More Telugu News