: ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు చురక అంటించిన బాలకృష్ణ

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు చిరకాల మిత్రుడు. వీరిద్దరి మధ్యం మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ లో బాబూరావు ఎన్డీయే అభ్యర్థి కోవింద్ కు ఓటు వేశారు. కోవింద్ పేరు ఎదురుగా 'ఒకటి' అంకె వేసి, బ్యాలెట్ పేపర్ పైన తన పేరు రాశారు. ఆ తర్వాత తన పేరు రాశానని అధికారులకు చెప్పారు. దీంతో, మీ ఓటు మురిగిపోతుందని అధికారులు ఆయనకు తెలిపారు. ఈ నేపథ్యంలో, మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అధికారులను ఆయన కోరారు. అలా ఇవ్వడం కుదరదని ఆయనకు అధికారులు తెలిపారు. దీంతో, ఆయన పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు.

ఈ విషయం బయటకు పొక్కడంతో మిగతా ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. ఈ విషయం ఓటు వేయడానికి వచ్చిన బాలయ్యకు సైతం చేరింది. దీంతో ఆయన బాబూరావుతో మాట్లాడుతూ, "2009 ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేయకపోవడంతో అప్పుడు నీ నామినేషన్ చెల్లలేదు. ఇప్పుడు ఈ ఎన్నికలో నీ పేరు రాసినందుకు నీ ఓటు చెల్లలేదు", అంటూ చురక అంటించారు. దీంతో, అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు.

More Telugu News