: కృష్ణా జిల్లాలో వింత.. మేకపోతుకు పాలు.. చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు!

ప్రపంచంలో వింతలకు కొదవేముంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వింతలు బయటపడుతూనే ఉంటాయి. అయితే అది మనపక్కనే జరిగినప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లులో జరిగిన వింత ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకూ పాకిపోయింది. ఇంకేముంది, చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.

ఇంతకీ ఎం జరిగిందంటే.. గ్రామానికి చెందిన మేకల పెంపకం దారుడు నక్కా రాంబాబు ఇటీవల ఓ మేకపోతును కొనుగోలు చేశాడు. ఇటీవల దానిని మందలో కలిపే సమయంలో దాని వృషణాలకు ఆనుకుని రొమ్ము ఉండడాన్ని గమనించిన ఆయన ఆసక్తిగా దాన్ని పితికి చూశాడు. అంతే.. పాలు రావడం మొదలుపెట్టాయి. దీంతో ఆయన దాని పాలు పితికి ఆయన పెంచుకుంటున్న కుక్కపిల్లకు పోస్తున్నాడు. ఇది కాస్తా ఊరంతా పాకిపోవడంతో ఈ వింతను చూసేందుకు జనాలు క్యూకడుతున్నారు. అయితే ఇదేమీ వింతకాదని, హార్మోన్ల లోపం వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని కంకిపాడు పశువైద్యాధికారి డాక్టర్ కర్నాటి మాధవరావు తేల్చేశారు.

More Telugu News