: పెరిగిన ఉత్కంఠ.. పూరీ జగన్నాథ్ రక్తనమూనాను తీసుకోనున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో

టాలీవుడ్‌లో క‌ల‌కలం రేపుతున్న డ్ర‌గ్స్ కేసులో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌ను ఎక్సైజ్ శాఖ‌ అధికారులు ఎనిమిది గంట‌లుగా విచారిస్తున్నారు. ప‌లు ఆధారాల‌ను తమతో ఉంచుకుని పూరీని విచారించిన అధికారులు ఆయ‌న నోటి నుంచి అన్ని నిజాల‌నీ రాబ‌ట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం హైద‌రాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాల‌యంలో సిట్ అధికారులు పూరీని విచారిస్తున్న చోటుకి ఉస్మానియా ఆసుప‌త్రి నుంచి నార్కోటిక్ నిపుణులు చేరుకోవ‌డంతో మరింత ఉత్కంఠ నెల‌కొంది. పూరీ ర‌క్త‌న‌మూనాల‌ను సేక‌రించి పూరీ డ్ర‌గ్స్ తీసుకున్నారా?  లేదా? అన్న విష‌యాన్ని వైద్య ప‌రంగా కూడా నిర్ధారించి అధికారులు నివేదిక త‌యారు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ 48 గంట‌ల క్రితం కూడా డ్ర‌గ్స్ తీసుకుని ఉంటే నార్కోటిక్ టెస్టులో ఆయ‌న ఏ డ్ర‌గ్స్ వినియోగించార‌న్న విష‌యం కూడా బ‌య‌ట‌ప‌డుతుంది.

More Telugu News