: వేశ్యలకు, దొంగలకు బహిరంగ ఉరి శిక్షలు... ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన వారు చెప్పిన సంచలన విషయాలు

ఉత్తర కొరియాలో జరుగుతున్న దురాగతాలపై ఆ దేశం నుంచి తప్పించుకుని బయటకు వచ్చి దక్షిణ కొరియాలో జీవితాన్ని గడుపుతున్న వారు వెల్లడించారని చెబుతూ విడుదలైన ఓ నివేదిక కలకలం రేపుతోంది. స్కూళ్లలోని ఆటస్థలాలు, మార్కెట్లు, షాపింగ్ ప్రాంతాలు... ఇలా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణమేనని, విద్యార్థులు వీటిని ప్రత్యక్షంగా చూస్తున్నారని వారు తెలిపారు.

వేశ్యావృత్తిలో ఉండి పట్టుబడిన వారికి, దొంగలకు, దక్షిణ కొరియా వారితో మాట్లాడుతూ, సమాచారాన్ని పంచుకునే వారికి బహిరంగ మరణదండన శిక్షలు విధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇక ఉరితీసే ప్రదేశాలను మ్యాప్ లో వారు గుర్తించారని చెబుతూ వాటిని ఈ నివేదిక ప్రచురించింది. కాగా, మూడేళ్ల నాడు కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్ష బాధ్యతలు  చేపట్టినప్పటి నుంచి మానవ హక్కుల ఉల్లంఘన పెరిగిందని ఐరాస కమిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓ క్రమ పద్ధతిలో హింసించి చంపుతున్నారని కూడా ఈ రిపోర్టు వెల్లడించింది.

More Telugu News