jagapathi babu: 'పటేల్ సార్' జగపతిబాబుకి నష్టం తెచ్చాడా?

తెలుగు సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రను ఎవరితో చేయిద్దామనే ఆలోచన రాగానే, ఇటీవలి కాలంలో దర్శక నిర్మాతలకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు జగపతిబాబు. అలాగే కథను మలుపు తిప్పే పాత్రలున్నా అవి ఆయనను వెతుక్కుంటూనే వెళతాయి. అంత బిజీగా వుండే జగపతిబాబు, కొత్తదనం కోసం 'పటేల్ సార్' సినిమా చేశారు. కొత్త లుక్ తో ఆయన అభిమానులను ఆకట్టుకున్నాడు.

 అయితే వసూళ్ల పరంగా ఈ సినిమా ఆయనను నిరాశ పరిచిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతే అయినా .. జగపతిబాబు కూడా కొంత పెట్టుబడి పెట్టినట్టుగా వినికిడి. పైగా పారితోషికం కూడా తీసుకోలేదని అంటున్నారు. అందువలన ఈ సినిమా జగపతిబాబుకి నష్టాన్నే తీసుకొచ్చిందని చెప్పుకుంటున్నారు. జగపతిబాబు ఇలాంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

More Telugu News