shivani: శ్రుతిహాసన్ లా రాజశేఖర్ కూతురు రాణించేనా?

బాలీవుడ్లో సీనియర్ హీరోల కూతుళ్లు సినిమాల్లోకి రావడం పెద్ద సంఖ్యలోనే జరుగుతూ ఉంటుంది. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే కమలహాసన్ కూతురు శ్రుతి హాసన్ .. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి .. అర్జున్ కూతురు ఐశ్వర్య కథానాయికలుగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురిలో శ్రుతి హాసన్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో క్రేజ్ తెచ్చుకుంది.

 అలాంటి శ్రుతి హాసన్ ను రాజశేఖర్ కూతురు శివాని స్ఫూర్తిగా తీసుకుంది. నాగబాబు కూతురు నిహారిక మినహా తెలుగులో సీనియర్ హీరోల కూతుళ్లు ఎవరూ హీరోయిన్ అనిపించుకునే సాహసం చేయలేదు. రాజశేఖర్ కూతురు శివాని మాత్రం ధైర్యంగా ఆ దిశగా అడుగులు వేస్తోంది. శ్రుతి హాసన్ లా స్టార్ హీరోయిన్ ను అవుతానని కాన్ఫిడెంట్ గా చెబుతోంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా తనని తాను మార్చుకుంటూ, శివాని ఆ స్థాయిని అందుకుంటుందేమో చూడాలి మరి.    

More Telugu News