kalyan ram: కల్యాణ్ రామ్ కోసం కొత్త తరహా ఫైటింగ్ కాన్సెప్ట్!

ఒక వైపున నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా విషయాలు చూసుకుంటూనే, మరో వైపున తాను హీరోగా చేస్తోన్న సినిమా పనుల్లోను కల్యాణ్ రామ్ బిజీగా వున్నాడు. ఆయన తదుపరి చిత్రంగా 'ఎం.ఎల్.ఏ' ( మంచి లక్షణాలున్న అబ్బాయ్) తెరకెక్కుతోంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది.

 ఈ సినిమా కోసం ఒక కొత్త తరహా ఫైటింగ్ కాన్సెప్ట్ ను డిజైన్ చేశారట. ఇంతవరకూ వచ్చిన ఫైటింగ్ ఎపిసోడ్స్ కి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. రెగ్యులర్ యాక్షన్ ఎపిసోడ్స్ కి భిన్నంగా తెరకెక్కించే ఈ ఫైట్ సీన్స్ .. ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తాయని చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా కాజల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.  

More Telugu News