rakul: విడో పాత్రలో రకుల్ కనిపించనుందా?

తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఓ సినిమాలో రకుల్ 'విడో' (వితంతువు) పాత్రలో కనిపించనుందనేది ఆ వార్త సారాంశం. రీసెంట్ గా తెలుగులో రెండు సినిమాలను పూర్తిచేసిన రకుల్, ప్రస్తుతం హిందీ సినిమా షూటింగులో బిజీగా వుంది. ఇవి కాకుండా రకుల్ చేతిలో మరో మూడు సినిమాలు వున్నాయట.

కాగా, ఏ భాషా సినిమా అనేది తెలియదు గానీ .. ఒక సినిమాలో మాత్రం ఆమె 'విడో'గా డీ గ్లామర్ పాత్రలో కనిపించనుందని చెప్పుకుంటున్నారు. ఆ సినిమాలో ఆమె పాత్ర బలమైనదనీ .. ఆ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని అంటున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలతో యూత్ ను కట్టిపడేసిన రకుల్, ఈ తరహా పాత్రను చేస్తుందా? అనేదే అందరి సందేహం. పాత్ర ప్రాధాన్యతను బట్టి ఒప్పుకునే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.   

More Telugu News