: మన దేశం ఎదుర్కోబోతున్న పెను సమస్య ఇదే: సచిన్ టెండూల్కర్

మన దేశంలో పెరుగుతున్న అనారోగ్య జనాభా ఆందోళనను కలిగిస్తోందని, భారత్ ఎదుర్కోబోతున్న పెను సమస్య ఇదేనని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. శారీరక వ్యాయామాలు లేకుండా, క్రీడల్లో పాల్గొనకుండా దేశంలో అనారోగ్య జనాభాను పెంచవద్దని యువతకు సూచించాడు. క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని హితవు పలికాడు. అనారోగ్యాల కారణంగా 2020 వరకు మన దేశం చాలా చిన్నగా మారిపోవచ్చని అన్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడ ఆడుతూ ఉండాలని చెప్పాడు. స్థూలకాయం విషయంలో మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు.

ఆటలు లేకుండా తాను ఒక్క క్షణం కూడా ఉండలేనని... క్రీడలు తనకు ఆక్సిజన్ లాంటి వని సచిన్ చెప్పాడు. చాలా మంది క్రీడలను ప్రొఫెషన్ గా భావిస్తుంటారని... అది చాలా తప్పని అన్నాడు. ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత ఫుట్ బాల్ జట్టుకు భారతీయులంతా పెద్ద సంఖ్యలో మద్దతు తెలపాలని కోరాడు. భారతీయులు క్రికెట్ నే కాకుండా, ఇతర ఆటలను ప్రోత్సహిస్తారని చెప్పడానికి ఇది గొప్ప అవకాశమని చెప్పాడు.

More Telugu News