: పాక్ మహిళా క్రికెటర్ల బాధలు అన్నీ ఇన్నీ కావు!

పాకిస్తాన్ లో మహిళలకు ఏపాటి గౌరవం దక్కుతుందో మనకు తెలుసు. ఇక ఆ దేశం తరపున ఆడుతున్న మహిళా క్రికెటర్లకు కూడా సరైన గౌరవం, సదుపాయాలను ఆ దేశ క్రికెట్ బోర్డు అందించడం లేదు. ప్రపంచ కప్ టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించిన తర్వాత... ఆ దేశ మహిళా క్రికెటర్లు అంతా స్వదేశం వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లడానికి వారికి కనీస రవాణా సౌకర్యాలను కూడా బోర్డు కల్పించలేదు. ఈ నేపథ్యంలో, బౌలర్ నష్రా సంధుకు లాహోర్ ఎయిర్ పోర్టు నుంచి తమ ఇంటికి తన కుటుంబసభ్యుడి బైక్ పైనే వెళ్లిపోయింది.

ఈ ఉదంతాన్ని స్థానిక టీవీ చానల్ ప్రసారం చేయడంతో దుమారం చెలరేగింది. ఈ టాపిక్ ప్రస్తుతం అక్కడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పీసీబీ వ్యవహరిస్తున్న తీరుపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఏ దేశం కూడా పాక్ కు వెళ్లి క్రికెట్ ఆడటానికి ఇష్టం చూపకపోవడంతో, ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, పాక్ మహిళా క్రికెట్ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. పీసీబీ నుంచి వీరికి ఏ మాత్రం సహకారం అందడం లేదు. వరల్డ్ కప్ లో పాక్ మహిళా జట్టు ఒక్క మ్యాచ్ ను గెలవకపోవడంతో, వీరి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 

More Telugu News