nani: పది రోజుల్లో పాతిక కోట్లు రాబట్టేసిన నాని!

ఒక్కో సినిమాతో నాని దర్శక నిర్మాతలకి తనపై గల నమ్మకాన్ని .. తన సక్సెస్ రేటును పెంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'నిన్నుకోరి' సినిమా కూడా ఇదే విషయాన్ని మరోమారు నిరూపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

తొలి వారాంతంలో 16 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమా, రెండవ వారం పూర్తయ్యేనాటికి 25.25 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తొలి పది రోజుల్లో ఈ సినిమా 46 కోట్లకి పైగా గ్రాస్ ను .. 25.25 కోట్ల షేర్ ను సాధించింది. ఫుల్ రన్లో ఈ సినిమా 35 కోట్ల షేర్ ను సాధించే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది.    

More Telugu News