: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం!

రెండు రోజుల క్రితం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. ఒడిశా, ఉత్తర కోస్తాకు వాయుగుండం వ్యాపించిందని, ఈ రోజు రాత్రికి ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. కొన్ని చోట్ల భారీగా, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

More Telugu News