varun tej: తానేం మారలేదంటోన్న శేఖర్ కమ్ముల!

'ఆనంద్' సినిమాను మంచి కాఫీ లాంటి సినిమా అంటూ శేఖర్ కమ్ముల ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక 'ఫిదా' విషయానికి వచ్చేసరికి .. ఈ సినిమా చూస్తుంటే .. మంచి వాన పడుతున్న ఫీల్ ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల చెప్పారు. ఈ సినిమా తన మార్క్ సినిమాగానే ఉంటుందనీ .. సినిమా చూసుకున్న తరువాత తానేం మారలేదనిపించిందని అన్నారు.

 కథానాయిక కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయడం వలన ఆలస్యమైందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను దిల్ రాజు లేపేశారనే ప్రచారంలోను నిజం లేదని అన్నారు. ఓ ప్రేక్షకుడిగా మాత్రమే దిల్ రాజు కొన్ని సూచనలు చేశాడని చెప్పారు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనీ .. దుమ్ములేపేస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.        

More Telugu News